ఇటీవల టీమిండియా పేసర్ శ్రీశాంత్ అన్ని ఫార్మెట్ల ఆట నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో లెజెండరీ కికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నిన్నెప్పుడూ ప్రతిభ కలిగిన బౌలర్ గానే నేను చూశాను. నీలో చాలా నైపుణ్యాలున్నాయి. ఎన్నో ఏళ్లు టీమిండియా క్రికెట్ కు నువ్వు సేవలందించినందుకు శుభాకాంక్షలు. నీ రెండో ఇన్నింగ్స్ కు ఆల్ ద బెస్ట్ ’’ అంటూ కామెంట్ చేశాడు.
కాగా, టీమిండియా తరఫున శ్రీశాంత్ 2005 నుంచి 2011 వరకు సేవలందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ పై 2013 నుంచి జీవిత కాల నిషేధం ఎదుర్కొన్న అతడికి.. 2019 ఆగస్టులో ఉపశమనం లభించింది. జీవిత కాల నిషేధాన్ని కోర్టు ఏడేళ్లకు తగ్గించింది. దీంతో 2020 నుంచి కేరళ తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. ఏ జట్టూ అతడిపై ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో రిటైర్యెంట్ ప్రకటించాడు.