పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు: మంత్రి ఎర్రబెల్లి

351
errabelli
- Advertisement -

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎర్ర‌బెల్లి . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న దేశ గ్రామాలు స్వ‌యం స‌మృద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మ‌న ప్ర‌జాస్వామిక రాజ్యాంగంలోనూ మూడంచెల ప‌ద్ధ‌తిలో… గ్రామాలు ప్రాథ‌మిక‌, మొద‌టి అంచెలో ఉన్నాయని…గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ నిర్మాణంలో గ్రామ‌ పంచాయ‌తీలు అత్యంత కీల‌కం అని స‌మాజంలో కుటుంబంలాగే… దేశానికి గ్రామాలే మొద‌టి సాంఘిక, సామాజిక, ఆర్థిక‌, రాజ‌కీయ శిక్ష‌ణా కేంద్రాలు అన్నారు.

మ‌న దేశ గ్రామాల నుంచే దేశ నిర్మాణం మొద‌ల‌వుతుందని…గ్రామాల‌ను మ‌రింత‌గా అభివృద్ధి ప‌రిచే విధంగా సీఎం కెసిఆర్ అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారని చెప్పారు. గ్రామ పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ట ప‌రుస్తున్నారని..గ్రామ పంచాయ‌తీల్లో మ‌హిళ‌ల‌కు 50శాతం రిజర్వేష‌న్లు క‌ల్పించారని చెప్పారు.

గ్రామాల‌కు మ‌రిన్ని నిధులు కేటాయిస్తున్నారని…ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాల స్వ‌రూపాన్నే మార్చేశారు. ఇప్పుడు గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పారు. ప‌చ్చ‌ద‌నం-పారిశుద్ధ్యం, మంచినీటి వ‌స‌తుల‌తో గ్రామాలు క‌ళ‌క‌ల‌‌లాడుతున్నాయని..ప‌ల్లె ప్ర‌గ‌తి కార‌ణంగానే గ్రామాల్లో అంటువ్యాధులు, క‌రోనా వైర‌స్ లు ప్ర‌బ‌లడం లేదన్నారు. వ్య‌వ‌సాయం దండుగ అన్న గ్రామాల్లో ఇప్పుడు పండుగ వాతావ‌ర‌ణం వెల్లి విరుస్తుందన్నారు.

- Advertisement -