అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం సిట్ విచారణలకు తెరలేపిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను విచారణలకు పిలుస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వారు ఊహించని మెజారిటీతో గెలవడంతో అధికార పార్టీకి వణుకు మొదలైందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కే పైచేయి ఉంటుందన్న భయంతోనే సిట్ విచారణలకు తెరలేపారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, బొగ్గు కుంభకోణంపై అవినీతిని హరీష్ రావు ప్రశ్నించగానే దాన్ని డైవర్ట్ చేసేందుకు ముందుగా హరీష్ రావుకు, తాజాగా కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ అంశంపై నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలేనని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Also Read:రిపబ్లిక్ డే ..భద్రత కట్టుదిట్టం!

