రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేస్ బౌలర్ ఆడమ్ మిల్నే గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. SA20 లీగ్‌లో ఆడుతున్న సమయంలో అతడికి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది.
మిల్నే స్థానంలో కైల్ జేమీసన్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు NZC వెల్లడించింది. జనవరి 18న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున MI కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిల్నే గాయపడ్డాడు. ఆసక్తికరంగా, ప్రస్తుతం కైల్ జేమీసన్ భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టులో భాగంగా ఉన్నాడు. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేశారు.
జనవరి 31 వరకు జట్లకు తమ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ గడువు తర్వాత ఏ మార్పు చేయాలన్నా తప్పనిసరిగా ICC అనుమతి అవసరం ఉంటుంది.మిల్నే గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందించారు. మిల్నే దురదృష్టకరంగా టోర్నీకి దూరమవడం బాధాకరమని, అయితే అతడు త్వరగా కోలుకుని బలమైన రీటర్న్ ఇస్తాడనే నమ్మకం ఉందన్నారు.
Also Read:Mogudu:’మొగుడు’..టైటిల్ ప్రోమో

