రేపు అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

525
sabarimala
- Advertisement -

దేశ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి వారి భక్తులు మాలలు ధరించి శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. నవంబర్ 17న తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. రెండు నెలల పాటు దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులందరూ దీక్షలు స్వీకరిస్తున్నారు. చాలా మంది భక్తులు వస్తుండటంతో అయ్యప్ప ఆలయం కిక్కిరిసిపోయింది. కాగా డిసెంబర్ 26న అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు సూర్య గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని 4గంటల పాటు మూసివేయనున్నారు.

ఈవిషయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్టు పేర్కొంది. 26న ఉదయం 8:06 గంటలకు ప్రారంభయ్యే సూర్యగ్రహణం ఉదయం 11:13 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా స్వామి వారి ఆయలంలో నెయ్యాభిషేకంతో సహా ఏ పూజలు నిర్వహించరు.

ఆలయం తెరచిన అనంతరం పుణ్యహవచన చేసి పూజలు కొనసాగించనున్నట్లు అయ్యాప్ప ఆయల ఈవో తెలిపారు. కేవలం ఒక్క అయ్యప్ప ఆలయమే కాకుండా మాలికాపురం, పంబలో ఉన్న ఆలయాలను కూడా 26న మూసివేయనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. కాగా ఇప్పటికే చాలా మంది భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శంచుకోగా చివర్లో చాలా మంది రానున్నట్లు తెలుస్తుంది.

sabaribala ayyappa temple be closed four hours december 26th due solar eclipse

- Advertisement -