తమిళ దర్శకుడు హరి ‘సింగం’ సీరీస్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి విక్రమ్‌తో ‘సామి’ (తమిళంలో ‘సామి స్క్వేర్’) అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. రెండు నిమషాలా పది సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్లో సినిమా ఎలా ఉంటుందో అనే విషయాన్ని డైరెక్టర్ హరి క్లియర్‌గా చూపించాడు. ‘సామి’ హరి స్టైల్లో సాగిపోయే మాస్ మసాలా చిత్రం.
ఇక తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కథానాయకుడు విక్రమ్. ఆయన నటించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో విక్రమ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్లో విక్రమ్ పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నారు.
‘మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి.. ’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించకూడదు..’ అని విక్రమ్ తన ప్రేయసి కీర్తి సురేశ్‌తో అంటే.. ‘నేను నలుగుర్ని ప్రేమిస్తాను’ అని ఆమె కోపంతో సమాధానం ఇచ్చారు. ‘పది తలలు ఉన్న రాక్షసరాజును’ అని విలన్ అంటే.. ‘నాకు కావాల్సింది మూడు తలలు’ అన్నారు విక్రమ్. ‘నేను పోలీసు కాదు.. పోకిరి’ అని చివర్లో వచ్చిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. మరి ఆలస్యం ఎందుకు ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కెయండి..