‘పుష్ప’ నుండి సామి సామి సాంగ్ విడుద‌ల..

105
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా పుష్ప. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదల కానుంది. ఇక ఇప్పటికే పుష్ప నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ‘పుష్ప” సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్రం నుండి మూడో సాంగ్ విడుద‌ల చేశారు. ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే.. నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. విజువ‌ల్స్ చాలా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదలైన ఈ సాంగ్‌కి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. కాగా ఇప్పటికే విడదులైన ఫస్ట్‌ సింగిల్‌ దాక్కో దాక్కో మేక, శ్రీవల్లిగా రష్మికపై చిత్రీకరించిన ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన ల‌భించింది.

- Advertisement -