కష్టానికి తగిన ఫలితం…సాక్ష్యం హిట్

207
Bellamkonda Sai Srinivas

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకీ నాయకా చిత్రాలతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ కమర్షియల్ హీరో లేటెస్టుగా “సాక్ష్యం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

హైదరాబాద్‌లో ఆదివారం విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ దక్కుతుందని.. సాక్ష్యం మేం పడిన కష్టానికి నిదర్శనమన్నారు.

పీటర్‌ హెయిన్స్‌ తీర్చిదిద్దిన యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయన్నారు. తప్పు చేస్తే ప్రకృతి గమనిస్తుందంటున్న భావనను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. దర్శకుడు నాకేం చెప్పాడో.. దాన్ని తెరపై అందంగా చూపించాడని తెలిపారు. ఇలాంటి కథని తెరకెక్కించడం అనుకున్నంత ఈజీ కాదని హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. మేం పడిన కష్టం దానికి తగిన ప్రతిఫలం వచ్చిందన్నారు.