మారుతి..ఓ బ్రాండ్ బాబు

335
maruthi
- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.భలే భలే మగాడివోయ్ సినిమాతో రూట్ మార్చిన మారుతి సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించాడు. తర్వాత శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాతో మెప్పించిన శర్వా ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు.

ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే మరోవైపు చిన్న సినిమాలకు కథ అందిస్తు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తాజాగా మారుతి కథ,మాటలు అందించిన చిత్రం బ్రాండ్ బాబు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మారుతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన దగ్గర పదేళ్లకు సరిపడ కథలున్నాయని…మారుతి సినిమాలంటేనే బ్రాండ్ అన్నారు. రాత్రికి రాత్రే స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని లేదని…నా కథకి సరిపడే హీరోతోనే ప్రయాణం చేస్తానన్నారు. కథ నచ్చితే చిన్న సినిమాలు నిర్మిస్తానని స్పష్టం చేశారు.

భలే భలే మగాడివోయ్‌ విజయోత్సవంలో భాగంగా అమెరికా వెళ్లాను. అక్కడే బ్రాండ్ బాబు కథను సిద్ధం చేసుకున్నాని ..బ్రాండ్‌ పిచ్చి ఉన్న ఓ కుటుంబంలోకి, ఓ పేదింటి పిల్ల కోడలిగా వస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ అన్నారు.

- Advertisement -