తెలుగు సినిమా స్ధాయిని ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడే కాదు భారత చలనచిత్ర రంగంలోని రికార్డులను తిరగరాసింది. బాహుబలి ముందు తర్వాత అనేలా చలనచిత్ర రంగాన్ని చెప్పుకునే స్ధాయికి సినిమా ఇండస్ట్రీ ఎదిగింది.
ఇప్పటివరకు ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న బాహుబలి మూవీ తాజాగా సీఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఖాతాలో చేరింది. అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ. ఇది ప్రకటించిన మరుసటి రోజే బాహుబలి రెండు కొత్త రికార్డులని క్రియేట్ చేసింది.
బాహుబలి2 చిత్రంలో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సాంగ్ సాహోరే బాహుబలి. ఈ పాట 2017లో గూగుల్ ప్లేలో అత్యధికంగా వీక్షించిన పాటగా చరిత్ర సృష్టించింది. యూ ట్యూబ్ లోనే ఈ సాంగ్ ని 83,416,764 మంది వీక్షించడం గమనర్హం. ఇక దీనితో పాటే బాహుబలి ది గేమ్ కూడా టాప్ స్థానంలో నిలిచి సత్తా చాటింది. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్’ , ‘సూపర్ మ్యారియో రన్’ , ‘పోకెమాన్ డ్యుయల్’ వంటి ఇంటర్నేషనల్ గేమ్ లను పక్కకు నెట్టి లోకల్ గేమ్ బాహుబలి టాప్ స్థానంలో స్థానం సంపాదించుకొని తెలుగు వారు గర్వించేలా చేసింది.