ఇస్మార్ట్ శంకర్‌తో రాజమౌళి సినిమా..!

557
SS Rajamouli
- Advertisement -

దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే జక్కన్న ఈ మూవీ పూర్తి కాకముందే తదుపరి చిత్రంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సనిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాయడం మొదలు పెట్టాడని తెలుస్తుంది. అయితే జక్కన ఈ సారి ఎవరూ ఊహించని హీరోతో సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరి ఆ హీరో ఎవరనేగా మీ సందేహం అతనెవరో కాదు.. ఎనర్జిటిక్‌ హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన ప్రస్తుతం రెడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిర్తే ఈయనతోనే రాజమౌళి తర్వాతి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. హీరో రామ్‌తో చిన్న మాస్ సినిమా ఒకటి చేయాలని చూస్తున్నాడట జక్కన్న. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొద్దిరోజుల్లోనే రానుందని సమాచారం.

- Advertisement -