7న కాజల్‌ ఎంత వరకు ఈ ప్రేమ ..

734
Enthavaraku ee prema release date
Enthavaraku ee prema release date

 గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కోలీవుడ్, బాలీవుడ్ లో ఒక్కో డిజాస్టర్లతో పలకరించింది కాజల్ అగర్వాల్. అయితేనేం జనతా గ్యారేజ్ లో చేసిన పక్కా లోకల్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది చందమామ. ఓవైపు ఖైదీ నంబర్ 150 తో సక్సెస్‌ అందుకుంది కాజల్. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తమిళంలో `కవలై వేండాం` తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` సినిమాతో మళ్లీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈనెల 7న (ఏప్రిల్ 7)న థీయేటర్లలోకి వస్తోంది. `రంగం` ఫేం జీవా హీరోగా యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించారు.. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్టు నిర్మాత డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ వెల్లడించారు.

Kajal agarwal

ఈ సందర్భంగా డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. అన్ని ప‌నులు పూర్తి చేశాం. ఈనెల 7న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్క‌డ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వ‌స్తోంది. తెలుగు ట్రైల‌ర్స్‌, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. జీవా, కాజ‌ల్ న‌ట‌న యువ‌త‌రానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని వంద శాతం మెప్పించే చిత్ర‌మిది“ అన్నారు.

Kajal agarwal