బిఆర్కే భవన్ నుండి లక్డికా ఫుల్ వరకు మెట్రో రైల్ షటిల్ సర్వీస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆధర్ సిన్హా,మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ వరకు ఈ షటిల్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. ఉదయం ,సాయంత్రం సచివాలయం నుండి లాక్డి కా పూల్ వరకు ఈ సర్వీస్ లు నడుస్తాయి. నగరంలో 40 ప్రధాన మార్గాల్లో ఈ షటిల్ సర్వీల్ లను అందుబాటులో ఉంచాము. నగరాలు అబివృద్దికి రవాణా ముఖ్యం అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (జిఎడి) ఆధర్ సిన్హా మాట్లాడుతూ.. ఈ షటిల్ సర్వీస్‌లు సచివాలయం ఉద్యోగులకు చాలా ఉపయోగపడతాయి. ఈ సర్వీస్‌లతో లాక్డికా ఫుల్ నుండి సచివాలయం త్వరగా చేరుకోవచ్చు. ఈ షటిల్ సర్వీస్‌లను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (జిఎడి) ఆధర్ సిన్హా అన్నారు.