రైతు భరోసా మూడో విడత..అప్‌డేట్

4
- Advertisement -

తెలంగాణలోని అన్నదాతలకు గుడ్ న్యూస్. సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు మే నెలలో మూడో విడత నిధులను పంపిణీ చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. రైతు భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా నిధులను సమీకరిస్తోంది.

సుమారు రూ. 12,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ నిధులను దాదాపు 7% నుండి 7.5% వడ్డీతో సేకరించి, రాబోయే 6 నుండి 25 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించనుంది

ఈ నిధులను ప్రధానంగా రైతు భరోసా, హైదరాబాద్ మెట్రో స్వాధీనం (సుమారు రూ. 15,000 కోట్లు), మరియు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో రైతులకు నిధులను విడుదల చేసింది.

Also Read:ఏపీ కేబినెట్ భేటీ..కొత్త పెన్షన్లపై చర్చ

ఇప్పుడు మూడో విడతలో భాగంగా నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మే నెలలో డబ్బులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ అవుతుంది

- Advertisement -