ఇంటి వ‌ద్ద‌కే రైతు బ‌జార్లు: నిరంజ‌న్ రెడ్డి

279
rythu bazar
- Advertisement -

ఇంటి వ‌ద్ద‌కే రైతు బ‌జార్లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి. హైదరాబాద్లో మాట్లాడిన ఆయ‌న వ్య‌వ‌సాయ, మార్కెటింగ్ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

63 మొబైల్ వాహనాలతో 109 ప్రాంతాలకు కూరగాయల అందించడమైంద‌ని…. కరోనా వైరస్ ప్రబలకుండా ఆంక్షల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ చొరవ చూపించింద‌న్నారు.

రైతుబజార్ల వద్ద రద్దీ నెలకొనకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముందడుగు వేసింద‌న్నారు. రైతు బజార్లలో రద్దీ ఉంటే వాటిని దగ్గరలోని ఖాళీ ప్రదేశముల కు, స్థానిక పోలీస్ సహకారముతో తరలించి సోషల్ డిస్టెన్స్ ను పాటించేటట్లు చర్యలు తీసుకోవాల‌న్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచాల‌న్నారు. అధిక ధరలకు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోండన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి .. ఇది ప్రత్యేక సమయం అన్నారు.

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మనమందరం ఐకమత్యంతో కృషిచేయాలని… నిత్యావసరాల సరఫరాకు ప్రభుత్వం నుండి అన్ని రకాల వెసులుబాట్లు కల్పించడం జరిగిందన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారుల దృష్టికి తీసుకురావాల‌న్నారు.

బోయిన్ పల్లి మరియు ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్ లు యధావిధిగా నడుస్తాయని… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మార్కెట్లకు ప్రజలు మాస్కులు ధరించి రావాల‌ని .. కనీస దూరం పాటిస్తూ కొనుగోలుకు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు.

మార్కెట్లో అమ్మకందారులు మాస్కులు ధరించడంతో పాటు, ప్రభుత్వ సూచనలు విధిగా పాటించాలని..
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

- Advertisement -