కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ…

54
rythu bandhu

రైతు బంధు పంపిణీ కొనసాగుతోంది. నేడు 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ కానున్నాయి రూ.1153.50 కోట్లు. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ కానున్నాయి.

నాలుగో రోజూ నల్లగొండకే అత్యధికం 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు ఉన్నాయి. అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు ఉన్నాయి. మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమకానున్న రూ.4095.77 కోట్లు ఉన్నాయి.

కరోనా విపత్తులోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయరంగమే అన్నారు. 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలని ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి చేయూత నిస్తున్నారని తెలిపారు.

రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు సరఫరాతో పాటు వంద శాతం పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలుస్తున్నారుని చెప్పారు. అందుకే కరోనా విపత్తులోనూ గత వానాకాలం, మొన్న యాసంగిలో కలిపి రూ. 14656.02 కోట్లు , ఈ వానాకాలంలో రూ.7508.78 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతుబంధు, ఉచితకరంటు , రైతుభీమా పథకాలతో తెలంగాణలో సాగు దశ – దిశ మారిందన్నారు.