నేటి నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు..

83
- Advertisement -

తెలంగాణ రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి రైతుబంధు నగదు జమకానుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమ చేశామని, ఈ సీజన్‌తో కలిపితే రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు.

ఎకరం భూమి ఉన్న రైతులకు 28న, రెండెకరాలు ఉన్న రైతులకు 29న, మూడెకరాలు ఉన్నవారికి 30న.. ఇలాగే రోజుకో ఎకరం పెంచుతూ వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి చెప్పారు. అలాగే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులైన 94 వేల మంది రైతుల ఆధీనంలోని 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల పదో తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులతో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ధ్రువీకరించిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులనూ లబ్ధిదారులుగా చేర్చినట్లు తెలిపారు.

- Advertisement -