సత్తుపల్లిలో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు..

110
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో గురువారం రైతుబంధు వారోత్సవాలు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వంచారు. రైతులు మహిళలు మూగలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సత్తుపల్లి పట్టణంలో రైతుబంధు వారోత్సవాలలో భాగంగా బియ్యం, గోధుమలతో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ముఖచిత్రం అందరిని ఆకట్టుకుంది.

యాసంగి పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం 8 విడతల్లో 50 వేల కోట్లకు చేరుతున్న సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతులు రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలుపునిచ్చారు.ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని రైతులు నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కృష్ణ మందిరం రోడ్డులో బియ్యం, గోధుమ గింజలతో వేసిన సీఎం కేసీఆర్ ముఖం చిత్రం,రైతన్న సూచిక రంగవల్లులు, పామ్ ఆయిల్ గింజలతో అద్దిన రైతుబంధు 50వేల కోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు,దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.దళితబంధు కేవలం దళితులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన వర్గాలకు భవిష్యత్తులో అమలయ్యే విధంగా కేసీఆర్ చర్యలు చేపడతారు అని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ,రైతు సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు.కేటీఆర్ పిలుపుమేరకు అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు.

- Advertisement -