బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే దానం తీవ్ర విమర్శలు..

23

భారతీయ జనతా పార్టీ బురదలో కూరుకుపోయింది అని ఆ బురదలో రాయి వేసి బురదమయం కాలేమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని వెంకటరమణ కాలనీ మహిళా మండలిలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ దర్భంగా దానం బీజేపీ నేతల తీరుపై ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర నేతలు అవగాహన లేకుండా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అపహాస్యం పాలవుతున్న అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

విజయశాంతి వ్యాఖ్యలపై తాను స్పందించడం బాగుండదని దానం అన్నారు. ఢిల్లీ నుంచే చెత్త వస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక శక్తి అని ఆయనతో పెట్టుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకోవటం మానుకోవాలని హితవు పలికారు. టిడిపి నేతలు ప్రవర్తన మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.