వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం:కేటీఆర్‌

18
ktr

రైతు బంధు..వ్యవసాయ చరిత్ర లో ఇదొక సువర్ణ అధ్యాయం అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్……ఈ రోజు తెలంగాణ చరిత్ర లొనే కాదు స్వాతంత్ర భారత చరిత్ర లో సువర్ణాక్షరా లతో లిఖించదగ్గ రోజు అన్నారు. 65 లక్షల రైతుల కుటుంబాలు,60 లక్షల టీ ఆర్ ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు ఒక సాహసం …కరోనా నిబంధనలను పాటిస్తూ అన్ని వర్గాలు కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ సంబరాలను సంక్రాంతి దాకా పొడ గిస్తున్నాం అన్నారు. కేసీఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాం…..టీ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అన్నారు. రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమం లో రైతుల దుస్థితి చూసి కేసీఆర్ చలించిన సందర్భాలు ఎన్నో……అపుడు కరెంటు లేదు పెట్టుబడి సాయం లేదు. పంట దిగుబడులు లేవు అన్నారు. మీడియా లో అపుడు రైతుల దుస్థితి గురించి వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుందన్నారు. వలసల దుస్థితి అంతరించింది……రైతుల దర్జా పెరిగిందన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయి……తెలంగాణ వ్యవసాయ రంగం లో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయన్నారు. వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చింది నిజం కాదు అన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్ల లో పడటం లేదా. కావాలంటే నా దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు. వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధు ను అనుసరిస్తున్నాయి
…50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందన్నారు.