ఈ నెల 28 నుంచి రైతుబంధు పంపిణీ..

38

ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు, దళితబంధుతో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పంట సాయం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లోనే రైతులందరికీ ఖాతాల్లోనే నగదును జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. గతంలో మాదిరిగానే ఎకరం మొదలుకొని విడుదల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ పురోగతిపై కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై సీఎం సమీక్షించారు. పరిస్థితి అదుపులోనే వుందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.