బాలీవుడ్‌లో ‘ఆర్ ఎక్స్ 100’.. హీరో ఎవరో తెలుసా..?

294
Ahan Shetty
- Advertisement -

టాలీవుడ్‌లో గత ఏడాది భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘ఆర్ ఎక్స్ 100’ కనిపిస్తుంది. కథలో కొత్తదనం ఉంటే.. చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్స్ రాబడతాయని ఈ మూవీ నిరూపించింది. రియల్ లైఫ్ కథకి.. కొద్దిగా సినిమా హంగులు జోడించి దర్శకుడు అజయ్ భూపతి రూపొందించాడు. యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా, చాలా తక్కువ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి .. భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాపై ఇతర భాషల దర్శక నిర్మాతల కన్ను ఈ మూవీపై పడింది.

RX100 Hindi Remake

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హిందీ రీమేక్ రైట్స్‌ను సాజిద్ నడియాడ్ వాలా దక్కించుకున్నారు. ఇందులో సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి కథానాయకుడిగా నటించనున్నాడు. అయితే తెలుగు మాదిరిగానే ఈ సినిమా హిందీలోనూ భారీ విజయం సాధిస్తుందనీ .. ఆహాన్ శెట్టి కెరియర్‌కి మంచి హెల్ప్ అవుతుందని సునీల్ శెట్టి భావిస్తున్నాడు. మరి కోలీవుడ్‌,బాలీవుడ్‌లో ఈ మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

- Advertisement -