మూడో మూవీకి రెడీ అవుతున్న ‘RX100’ హీరో..

349
Hero Kartikeya
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ ‘RX100’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా లుక్స్.. పెర్ఫార్మన్స్ విషయంలో కార్తికేయకు మంచి మార్కులు వచ్చాయి. దీంతో కార్తికేయతో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాల బోగట్టా. అయితే ఈ హీరో ఇదివరకే రెండో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Hero Kartikeya

‘హిప్పీ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ తమిళ – తెలుగు ద్విభాషా చిత్రానికి దర్శకుడు టీఎన్‌ కృష్ణ. ఈ సినిమాను కలైపులి థాను నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలు కానుంది. అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకముందే హీరో కార్తికేయ మరో చిత్రం పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో మల్లిఖార్జున్ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -