పెళ్లికొడుకైన RX 100 డైరెక్టర్ ..!

306
RX 100 Director Ajay Bhupathi Marriage
- Advertisement -

RX 100 సినిమా తో తొలి ప్రయత్నంతోనే హిట్ కొట్టి ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడ్డ మన అజయ్ భూపతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ ఇంటివాడైపోయాడు. హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ కల్యాణ మండపం లో నిన్న సాయంత్రం పెళ్లి చేసేసుకున్నాడు భూపతి.

RX 100 Director Ajay Bhupathi Marriage

వధువు పేరు లక్ష్మి శిరీష . తూర్పు గోదావరి జిల్లా ,ఆత్రేయపురం నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారట. కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ప్రేమను అంగీకరించకపోవడంతో వాళ్ళని సంవత్సరాల తరబడి ఒప్పించే ప్రయత్నం లో ఉన్నారు. ఈ మధ్య మన డైరెక్టర్ మొదటి సినిమాతో హిట్ కొట్టడంతో భూపతి సత్తా తెలిసి, వాళ్ళ ప్రేమను అంగీకరించి పెళ్లి నిశ్చయించారు అమ్మాయి కుటుంబ సభ్యులు.

RX 100 Director Ajay Bhupathi Marriage

 

RX 100 సినిమా నిర్మాతలతోనే భూపతికి వేరొక సినిమా క్యూలో ఉంది. మరిన్ని క్రేజీ ఆఫర్లు ఈ యంగ్ డైరెక్టర్ కు ఉన్నాయని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అటు కెరీర్ లో మంచి ఊపందుకుని, ఇటు తన ప్రేమను కూడా గెలుచుకున్న అజయ్ భూపతి కెరీర్ లో ఇంకా మంచి స్థాయి కి చేరుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -