‘ధృవ్‌ను కనిపెట్టండి’-పాయల్ రాజ్‌పుత్‌

259
Payal Rajput
- Advertisement -

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్ రాజ్‌పుత్‌ తమ్ముడు ధృవ్‌ రాజ్‌పుత్‌ మూడేళ్లుగా కనిపించడం లేదట. ఈ రోజు తన సోదరుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ పాయల్‌ ట్వీట్‌ చేసింది. పాయల్ సోదరుడు ధృవ్ రాజ్‌పుత్(25)… 27 మార్చి 2016 నుంచి కనిపించటం లేదట. ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదట. దీంతో చాలా బాధపడుతూ సోషల్ మీడియాలో పాయల్ ఈ పోస్ట్ పెట్టి.. తన సోదరుడి ఫోటోను షేర్ చేసింది.

Payal Rajput

‘‘నా సోదరుడు కనిపించట్లేదు! ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య. నువ్వు ఈ సందేశం చూస్తావని ఆశిస్తున్నా. నువ్వు ఎక్కడైనా చిక్కుకు పోయి ఉంటే.. మాకు ఎలాగైనా ఒక్కసారి కాల్ చెయ్యి. మేమంతా నీకోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నోసార్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేదు’’ అని ట్వీట్ చేసిన పాయల్.. ‘ధృవ్‌ను కనిపెట్టండి’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేసింది.

- Advertisement -