ఉక్రెయిన్‌ ప్రాంతాలు రష్యాలో విలీనం..

172
ukraine
- Advertisement -

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన రష్యా…తాజాగా మరో ముందడుగు వేసింది. ఉక్రెయిన్ నుండి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు లుహాన్స్‌, జపోరిజియా, డొనెట్క్స్‌, ఖేర్సన్‌లను రష్మాలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం కూడా చేశారు.

మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆ నాలుగు రీజియన్లకు సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన ఆయన.. విలీన ప్రాంతాలను మాత్రం వదులుకునేది లేదని స్పష్టంచేశారు.

దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్‌ భూభాగాలను తిరిగి కలుపుకుంటామని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. పుతిన్‌ ప్రకటనపై పశ్చిమ దేశాలు కూడా తీవ్రంగా స్పందించాయి. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని, చట్టవిరుద్ధ రెఫరెండంలను, విలీన ప్రక్రియలను తాము గుర్తించబోమని యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు పేర్కొన్నాయి.

- Advertisement -