ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్, రష్యాలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు పోటీ పడుతుండగా రష్యా విడుదల చేయనున్న వ్యాక్సిన్‌పై అందరి దృష్టి ఉంది.
ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది రష్యా. వాక్సిన్ రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మొదట దేశంలోని 1600 మంది వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, ముసలివారికి అందజేస్తారు. ఆ తరువాత దేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
ప్రపంచవ్యాప్తంగా రష్యా విడుదల చేసే వ్యాక్సిన్‌పై అనుమానాలు నెలకొనగా వాటిని రష్యా పట్టించుకోవడం లేదు. తాము అన్ని విధాలుగా కరెక్ట్ గా చేస్తున్నామని, వాక్సిన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని రష్యా ఆరోగ్యశాఖ చెప్తోంది.
ఇక పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా,ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రానున్న కరోనా వ్యాక్సిన్ ధర సామాన్యులకు అందుబాటులోనే ఉండనుంది. కేవలం రూ.225కే కరోనా వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది సీరమ్ ఇండియా. అమెరికా కూడా సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి వాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.