కరోనాపై పోరులో ఇది నిజంగానే శుభవార్త. కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో ఆగస్టు 3న కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది రష్యా. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు రష్యా వైద్య శాఖ మంత్రి.
ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని ఆయన తెలిపారు.ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను వేలాది మందిపై నిర్వహించ నున్నట్టు వెల్లడించారు.
సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానంగా దృష్టి పెట్టారు.ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్ ట్రయల్స్ విజయ వంతంగా పూర్తైనట్లు తెలిపారు.
అన్ని సక్రమంగా జరిగినట్లయితే… ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్ నిలవనుంది.ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది.వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.