- Advertisement -
ఉక్రెయిన్‌పై అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇప్పటికే ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టగా ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా అధికారికంగా యుద్ధాన్ని రష్యా ప్రకటించే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
మే 9వ తేదీన పుతిన్ చేసే ప్రకటనతో ఆ దేశం తన రిజర్వ్ దళాలను యుద్ధ రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా సాగుతున్న వార్‌లో ఇప్పటి వరకు పది వేల మంది రష్యా సైనికులు చనిపోయారు.
ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్రమణకు వెళ్లినట్లు కానీ పుతిన్ అధికారికంగా చెప్పలేదు.
- Advertisement -