భారత్ – చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్ని నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఇరు దేశాలు తమ మధ్య సమస్యలను పరిష్కరించుకోగల సామర్ధ్యం కలిగి ఉన్న వారని తెలిపిన పుతిన్..ఈ ప్రక్రియలో ఏ శక్తి జోక్యం చేసుకోకూడదని సూచించారు.
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతపై మాట్లాడిన పుతిన్…. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులు అని తెలిపారు. ఒక దేశం ఇతర దేశాలతో ఎంతవరకు సంబంధాలను పెంచుకోవాలో అంచనా వేయడం మన పని కాదన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని నియంత్రించడానికే క్వాడ్ (ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా) సమూహాన్ని రూపొందించినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు పొరుగు దేశాల మధ్య జరగడం సర్వసాధారణమని పేర్కొన్నారు పుతిన్.