ఉక్రెయిన్ – రష్యా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్థరాత్రి ఉక్రెయిన్ పై మిస్సైల్స్‌తో విరుచుకపడింది రష్యా. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వేలాది మంది చనిపోగా తాజా దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
యుక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకపడగా షాపింగ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో 21 మంది మృతి చెందినట్లు, మరో 50 మందికి గాయాలైనట్లు తెలిసింది. అయితే, రష్యా మిస్సైల్స్ దాడులపై యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..త్రిష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి తాము డ్రోన్లను పంపి దాడికి యత్నించామంటూ వస్తున్న ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. తమకు ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తాము క్రెమ్లిన్ పై డ్రోన్ దాడి చేయలేదని చెప్పింది.
Also Read:ఢిల్లీలో BRS ఆఫీస్ ప్రారంభం..