రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచదేశాలు రష్యా మీద ఆంక్షలు విధిస్తున్నారు. అయితే తాజాగా రష్యా అమెరికాపై ఆంక్షలు విధించారు. దాదాపుగా 500మందిని రష్యా నిషేధించింది. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు ఒబామాతోపాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, టెలివిజన్ స్టార్స్ స్టీఫెన్ కోల్‌బెర్గ్, జిమ్మీ కిమ్మెల్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఈ జాబితాలో 45 మంది యూఎస్ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు కూడా ఉన్నారు. ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్కోవిచ్‌కు కాన్సులర్ యాక్సెస్ కోసంచేసిన అమెరికా అభర్థనను కూడా తిరస్కరించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read: మితవాది బిపిన్ చంద్రపాల్ వర్థంతి
గత నెలలో ఐక్యరాజ్య సమితిలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పర్యటనను కవర్ చేయాలనుకున్న రష్యా జర్నలిస్టులకు అమెరికా వీసాలు నిరాకరించింది. ఆ చర్యకుప్రతిస్పందనగానే ఇవాన్‌కు కాన్సులర్ యాక్సెస్‌ను తిరస్కరిస్తున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది.
Also Read: MODI:విశ్వ శాంతి స్థాపకుడు మన గాంధీ