ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి ఘోర దాడికి పాల్పడింది. నిప్రో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా గనుల్లో పనిచేసే మైన్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. పనిముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
డ్రోన్ దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, దేశీయంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనను అడ్డుకున్నారు.
Also read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

