Rakul:పెళ్లికి రెడీ అవుతున్న రకుల్!

52
- Advertisement -

‘రకుల్ ప్రీత్ సింగ్’, బాలీవుడ్ కి చెందిన నటుడు – నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరి పెళ్లి పై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. మరి ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుందా.. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని త్వరలోనే వివాహం చేసుకుకోబోతుందా.. ఇప్పుడిదే బాలీవుడ్ మీడియా నుంచి టాలీవుడ్ మీడియా వరకు జరుగుతున్న చర్చ. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం వరకు సీక్రెట్ రిలేషన్ ని మైంటైన్ చేసిన రకుల్ ప్రీత్ – జాకీ భగ్నానీ లు ఇప్పుడు పబ్లిక్ గా తిరుగుతున్నారు. బాలీవుడ్ ఈవెంట్స్ కి జంటగా హాజరవుతున్నారు. అయితే రకుల్ ప్రీత్ తాము ఇంకొద్ది రోజులు ఈ రిలేషన్ లో కొనసాగాలని.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించిన ఆలోచన లేదు అని చెబుతూ వస్తుంది.

కానీ, గత ఫిబ్రవరిలోనే రకుల్ ప్రీత్ – జాకీ భగ్నానీ లు వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ నడిచినా.. అది రూమర్ అని ఈ జంట కొట్టిపారేసింది. కానీ, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కుటంబ సభ్యుల ఒత్తిడితో పెళ్ళికి సిద్దమవుతుంది అనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది. రకుల్ వ‌య‌సు ఇప్పుడు 33, జాకీ భగ్నానీ కు 38 ఏళ్ళు. ఈమధ్యన రకుల్ కుటుంబ‌స‌భ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవ‌డంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. రకుల్ -జాకీ భగ్నానీ లు డిసెంబ‌ర్ చివ‌రి వారం లేదా జ‌న‌వ‌రిలో నిశ్చితార్థం చేసుకుని.. వచ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారంటున్నారు.

అయితే, ఈ పెళ్లి విష‌యంపై రకుల్ కానీ, జాకీ భగ్నానీ కానీ అధికారికంగా స్పందించలేదు. మరి ఈ ముదురు జంట పెళ్లి పై మనసు పారేసుకుంటుందా ? లేక డేటింగ్ అంటూ హోటల్స్ కే పరిమితం అవుతుందా ? అనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతుంది. ఆమెకు అటు హిందీలో కూడా ఛాన్స్ లు తగ్గాయి. అందుకే, మళ్లీ సౌత్ పై ముచ్చట పడుతుంది.

Also Read:వన్డేల్లో విరాట్ సరికొత్త చరిత్ర

- Advertisement -