మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ పై పుకార్లు

29
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా గుంటూరు కారం. హారికా హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చిన‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మ‌హేష్ బాబు ఏకంగా రూ.80 కోట్ల రెమ్యూన‌రేష‌న్‌ను తీసుకుంటున్న‌ట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నాన్ పాన్ ఇండియ‌న్ స్టార్ల‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న న‌టుడిగా మహేష్ బాబు రికార్డుకెక్కాడు అంటూ అనేక కథనాలను వైరల్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదు. మహేష్ బాబు ఈ సినిమాకు గానూ మొత్తం రెమ్యూన‌రేష‌న్‌ ను తీసుకోవడం లేదు.

లాభాల్లో మరియు బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటూ పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. పార్టీ పెద్ద‌లైన ప్ర‌కాష్ రాజ్, జగ‌ప‌తి బాబుల మ‌ధ్య జ‌రిగే యుద్ధంలోకి మ‌హేష్ బాబు ఎందుకొచ్చాడ‌నేదే గుంటూరు కారం కీల‌క పాయింట్‌గా ఉండ‌నుంద‌ట‌. కానీ, ఎందుకో ఈ సినిమా విషయంలో మ‌హేష్ బాబు ముందు నుంచీ నమ్మకంగా లేడు.

Also Read:బాక్సింగ్‌ రింగ్‌లో మృణాల్..పంచ్‌ కొడితే!

తన తర్వాత సినిమాని మహేష్ రాజమౌళితో చేస్తున్నాడు. కాబట్టి, ఈ సినిమా కూడా ఆ సినిమా స్థాయిలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ స్థాయిలో ఈ సినిమా అవుట్ ఫుట్ రావడం లేదు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరితో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.

Also Read:కిషన్ రెడ్డి.. కమలంలో మార్పు తెస్తారా?

- Advertisement -