గాంధీ నుండి ఎవరు పారిపోలేదు…

140
gandhi hospital

గాంధీ ఆస్పత్రి నుండి కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న వ్యక్తి పారిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి. గద్వాలకు చెందిన కరోనా బాధితుడు గాంధీ ఐసోలేషన్‌ వార్డు నుండి పరారయ్యాడని వార్తలొచ్చాయి. అది తప్పుడు వార్తని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పటిష్ట బందోబస్తు ఉందని…బాత్ రూం అని చెప్పి వెళ్లిన బాధితుడు హాస్పిటల్‌లోని మరోవార్డులోకి వెళ్లాడని చెప్పారు.

ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌ వార్డులో ఉన్నాడని…. బాధితుడు బాత్‌రూంకి వెళ్లే సమయంలో కనిపించకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు.