త్రిష పెళ్లి పై కొత్త గాసిప్ అండోయ్

19
- Advertisement -

సీనియర్ బ్యూటీ ‘త్రిష’ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో, త్రిష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? గత రెండేళ్లుగా త్రిష, ఓ తమిళ నిర్మాతతో ప్రేమలో ఉంది. వచ్చే నెలలో త్రిష – ఆ నిర్మాత పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. అందుకే త్రిష కొత్తగా మరో తెలుగు సినిమా ఏదీ ఒప్పుకోలేదని టాక్.

అలాగే, ఇంకా త్రిష ఏ తమిళ సినిమాకి కూడా సైన్ చెయ్యలేదు కాబట్టి.. బహుశా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. దాంతో తాజాగా త్రిష తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తాను మరో రెండేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ త్రిష చెప్పుకొచ్చింది. అయితే, తాను ప్రస్తుతం తెలుగు సినిమాలను కొత్తగా అంగీకరించక పోవడానికి ప్రధాన కారణం తమిళ సినిమాలతో బిజీగా ఉండటమేనట. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాత్రమే ప్రస్తుతం త్రిష నటిస్తోంది.

ఏది ఏమైనా త్రిష వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది. అసలు త్రిష ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. తెలుగు హీరో రానాతో కూడా ఆమె ప్రేమలో పడింది. కానీ, చివరకు ఓ నిర్మాత తో సెటిల్ అయ్యింది అన్నమాట. త్రిషకి ఉన్న మరో మంచి లక్షణం ఆమె చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకు కూడా ఆమె ఎమోషనల్ అయిపోతారు. పైగా ఓ ట్రస్ట్ కూడా నడుపుతుంది. ఇవన్నీ తెలిసిన నెటిజన్లు ఈమెది ఇంత ప్యూర్ హార్ట్ ఏంట్రా బాబు అంటూ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లేటు వయసులో త్రిష ఫుల్ జోష్ లో ఉంది.

Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!

- Advertisement -