ఇటు ప్రేమ పుకార్లు.. అటు తృప్తి లేదు

91
- Advertisement -

శోభిత ధూళిపాళ పై గత కొన్ని రోజులుగా ప్రేమ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఎన్ని వినిపించినా ఆమె శైలి భిన్నం. ఆమె వ్యవహార శైలి విభిన్నం. బహుశా అందుకే కావొచ్చు.. ఆమె నుంచి వచ్చే కంటెంట్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్ లు అనే తేడా లేకుండా నటిగా తనను తానూ అన్నిచోట్ల విస్తరించుకుంటుంది. పైగా ఆ రకంగానూ శోభిత ధూళిపాళ గుర్తింపు తెచ్చుకుంది.

ఐతే, శోభిత ధూళిపాళ మాత్రం తను క్రేజ్ కోసం ఇండస్ట్రీకి రాలేదని, అందుకే ఏదో ఒక సెగ్మెంట్ కే పరిమితమైపోనంటోంది. శోభిత ధూళిపాళ కు ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని అనిపిస్తుంటుందట. ముఖ్యంగా పాత్రల విషయంలో తనకు తృప్తి ఉండదంటోంది శోభిత. తన వర్క్ ను తన నటన ను ఎప్పటికప్పుడు ఛాలెంజ్ గా తీసుకుంటుందట. అందుకే తనకు తృప్తి ఉండదు అని శోభిత ధూళిపాళ చెప్పుకొచ్చింది.

ఇక నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నారంటూ ఓ వార్త గత కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉంది. ఇంతవరకు ఈ వార్త పై అటు చైతు కానీ, ఇటు శోభిత కానీ స్పందించనేలేదు. కాకపోతే, తన ప్రేమ గురించి శోభిత ధూళిపాళ గతంలో ఓ మాట చెప్పింది. కచ్చితంగా తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అని, ప్రేమ అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రేమలో తప్పులు చేయకుండా ఉండలేం అని చెప్పింది. దీనిబట్టి ఆమె నిజంగానే లవ్ లో ఉంది అనుకోవాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -