రాజకుమారిగా రుక్మిణి వసంత్!

9
- Advertisement -

రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కాంతారా చాప్టర్ 1. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తన అద్భుతమైన నటనతో ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకుంది రుక్మిణి వసంత్.ఇప్పుడు ఈ అంబిషస్ ప్రీక్వెల్‌లో ఒక రాజకుమార్తె పాత్రలో నటించబోతున్నారు.

ఆమె పాత్ర కథనానికి సరికొత్త అందం తీసుకొస్తుందని తెలిపారు మేకర్స్‌. ఇందుకు సంబంధించి ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పౌరాణిక నేపథ్యంలో ఆమె పాత్రను ఎలా తీర్చిదిద్దుతారో అనే ఆసక్తి పెరుగుతోంది.

మొదటి భాగం కాంతారా ఇంకా ప్రేక్షకుల మనసుల్లో తాజాగా ఉండగా రుక్మిణి నటన ఈ మహత్తర గాథకు మరింత లోతు, నాటకీయతను జోడిస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:బ్రహ్మోత్సవాలు..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

- Advertisement -