మందు కొట్టిన బాలయ్య..నిర్మాత క్లారిటీ!

18
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరుగగా బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ వేడుకలో అంజలిని బాలయ్య నెట్టేయడం, బాలయ్య మందు కొట్టారనే వార్త సెన్సేషన్‌గా మారింది. బాల‌కృష్ణ కాళ్ల ద‌గ్గ‌ర మందు బాటిల్ ఉన్న‌ట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో నిర్మాత నాగ‌వంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఈవెంట్ ను నిర్వ‌హించింది తామేన‌ని.. అక్క‌డ ఏముందో త‌మ‌కు తెలుస‌ని చెప్పారు. ఎవ‌రో కావాల‌నే బాల‌య్య కాళ్ల ద‌గ్గ‌ర మందు బాటిల్ ఉన్న‌ట్లుగా సీజీ వ‌ర్క్ చేశార‌ని క్లారిటీ ఇచ్చేశారు.

- Advertisement -