డిపోల దగ్గర 144 సెక్షన్‌…5 గంటల నుంచే మెట్రోసేవలు

634
rtc strike metro
- Advertisement -

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే పోలీస్‌ బందోబస్తు మధ్య సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సమ్మెలో పాల్గొనే కార్మికులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దని…. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేసింది ప్రభుత్వం. ఇకపై కార్మికులతో చర్చలు ఉండవని స్పష్టం చేసింది.

మరోవైపు ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్‌లు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు లాస్ట్ ట్రైన్ బయలుదేరి చివరి డెస్టినేషన్‌కు 12గంటల30 నిమిషాలకు చేరుకుంటుంది. రద్దీని బట్టి ప్రతి మూడు నిమిషాలకు ఒక ట్రైన్ నడపనున్నారు.

కర్ణాటక,మహారాష్ట్రల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు 8వేల స్కూల్ బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. సరిగ్గా పండగ సమయాన్ని చూసుకుని సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంపై ప్రయాణికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చే ఈ సమయంలో సమ్మె చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -