చిరు-కొరటాల మూవీకి ముహుర్తం ఖరారు..!

528
koratala siva
- Advertisement -

సైరాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది సైరా. ఇక ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చిరు.

దీపావళి నాటికి ముహుర్తపు షాట్‌ని తీయాలని భావిస్తున్నారట కొరటాల శివ. నవంబర్ తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరిపే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా రామ్ చరణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

చిరు సరసన అనుష్క,త్రిష లేదా నయనతారలలో ఒకరిని హీరోయిన్‌గా తీసుకోనున్నారని సమాచారం.

- Advertisement -