రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

490
rtc
- Advertisement -

సీఎం కేసీఆర్ హామి మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు ఒక్కొక్కరుగా విధుల్లో చేరుతున్నారు. తమ తమ డిపోల్లో సమ్మతి పత్రాలు అందజేసి విధులకు హాజరవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాము సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా ఖమ్మం డిపోలో ముగ్గురు సిబ్బంది విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్సు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మీకి విధుల్లోకి చేరుతున్నట్లు లేఖ అందజేశారు కండక్టర్ బుర్ర శ్రీదేవి.ఇక నిర్మల్ జిల్లా బైంసా డిపోలో 4గురు సిబ్బందిలో డ్యూటీలో జాయిన అవుతున్నట్లు డిపో మేనేజర్ కు సమ్మతి పత్రం అందజేశారు.

పి. కృష్ణ , ఖమ్మం డిపో కండక్టర్ , రాంబాబు.. సూపరింటెండెంట్ ఆఫ్ ఫైనాన్స్, , పీ.ఎం. ఖాన్ , మధిర డిపో కండక్టర్ ఈ మగ్గురు ఇవాళ విధుల్లో చేరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల్లో వందల సంఖ్యలో కార్మికులు సమ్మతి పత్రాలు అందజేసి విధులకు హాజరయ్యారు. ఇవాళ అర్ధరాత్రి వరకు సీఎం కేసీఆర్ కార్మికులకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి లోపు ఎవరైతే డ్యూటీలో చేరతారో వారే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగనింపబడతారని హెచ్చరించారు సీఎం.

- Advertisement -