ఇకపై యూనియన్లను ఆశ్రయించం: ఆర్టీసీ కార్మికులు

544
rtc employees
- Advertisement -

ఉద్యోగ భద్రత కల్పిస్తే ఇకపై యూనియన్లను ఆశ్రయించమని స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. 52 రోజుల సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ పిలుపుతో ఉదయం నుంచే విధుల్లో చేరేందుకు పెద్ద ఎత్తున డిపోలకు చేరుతున్నారు కార్మికులు. దీంతో డిపోల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఆర్టీసీలో యథాతథ స్ధితి వచ్చేందుకు వారం రోజులు పడుతుందని షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో తమను విధుల్లోకి తీసుకున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ముచేయమని సంస్థను అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషిచేస్తామన్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని కార్మికులు సమ్మెకాలంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించి విధుల్లోకి చేరుతున్నారు.

సుదీర్ఘ కేబినెట్ భేటీ తర్వాత ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్ల తక్షణ సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కిలోమీటరుకు 20 పైసల ఛార్జీలను పెంచారు. దీంతో సంవత్సరానికి ఆర్టీసీకి రూ. 760 కోట్ల అదనపు ఆదాయం రానుంది. దీనికి తోడు సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు సీఎం. దీంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

The chief minister said that the employees were misled by the unions with impracticable demands. RTC Employees Joins in Duties

- Advertisement -