బీజేపీలో చేరిన బిగ్ బాస్ కౌశల్,బైరెడ్డి

531
ap bjp
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్‌, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా,సీనియర్ నేతలు రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

కౌశల్‌తో పాటు ఆయన భార్య నీలిమ, ప్రముఖ రేడియోలాజిస్ట్ డా.సభారి,బైరెడ్డి కుమార్తె శబరి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బిగ్ బాస్‌ 2 విజేతగా నిలిచారు మందా కౌశల్. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన కౌశల్ ఆర్మీ పేరుతో బాగా పాపులర్ అయ్యారు.

ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బైరెడ్డి . 1994లో నందికొట్కూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో టీడీపీకి గుడ్‌బై చెప్పి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా ఆపార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ గూటికి చేరారు.

rayalaseem parirakshana samithi president byreddy rajashekar reddy,big boss 2 winner kaushal joins bjp in front of jp nadda,ram madhav.

- Advertisement -