మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు కావడంతో ప్రధానపార్టీల నేతలంతా ప్రచారంపై పూర్తిదృష్టిసారించారు. నవంబర్ 3న ఎన్నికలు జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు అనేది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రధానంగా పోరు టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ మధ్య ఉండనుండగా గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దేనని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తుండగా తాజాగా బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ సంస్థ నిర్వహించిన సర్వే అంటూ న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలుస్తోంది. మండలాల వారీగా సర్వే నిర్వహించగా అన్ని మండలాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబర్చిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక టీఆర్ఎస్‌కు ఓవరాల్‌గా 99,170 ఓట్లు రాగా బీజేపీ రెండో స్ధానానికే పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 62,360 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 31,770 ఓట్లు,బీఎస్పీకి 10,500 ఓట్లు వచ్చినట్లు వెల్లడించింది. అయితే నిజంగానే ఈ సర్వే ఆర్ఎస్ఎస్ చేసిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మునుగోడు ప్రచారంలో వాస్తవానికి అన్నిపార్టీల కంటే ప్రచారంలో ముందంజలో ఉంది టీఆర్ఎస్. బీజేపీ అభ్యర్థి రాజీనామా చేసినప్పటి నుండే ప్రచారాన్ని మొదలుపెట్టినా ప్రజల్లో మాత్రం ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలను ప్రజలు నిలదీసిన సందర్భాలున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బీజేపీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ ప్రధానంగా అభివృద్ధి ఎజెండానే ముందుకు సాగగా ప్రజలు బ్రహ్మారథం పట్టారు.
ఇవి కూడా చదవండి..
BB6.. డేంజర్ జోన్‌లో ఎంతమందో తెలుసా
రాహుల్‌కు కేటీఆర్ చురకలు..
నిరాడంబరుడు…గుమ్మడి