దళిత గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా బుక్ చేస్తారు? చెప్పాలన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు వెయ్యాలి కదా.. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? లీకేజీ మాఫియాకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం నేరమా చెప్పాలన్నారు.
కేటీఆర్ దళితులను ఏం అన్నారని? ఎక్కడ ఎవరిని దూషించారని అట్రాసిటీ కేసు పెట్టారు? అసలు ఆయనకు నిందితుల కులం తెలిసే అవకాశం ఉందా? పదవ తరగతి విద్యార్థుల్లో ఎస్సీ ఎస్టీలు ఉండరా?, కేటీఆర్ మీద కేసు బీఆరెస్ పార్టీ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినందుకా.. సచివాలయానికి అడగకుండానే అంబేడ్కర్ పేరు పెట్టినందుకా? చెప్పాలన్నారు.
దళితులకు పది లక్షల దళిత బంధు పథకం అమలు చేసినందుకా?.. దళితుల కోసం వందలాది గురుకుల పాఠశాలలు స్థాపించినందుకా? చెప్పాలన్నారు. దళిత – గిరిజన విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పించి విదేశాలకు పంపినందుకా?, అసలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరిపై బుక్ చేయాలి? అన్నారు. 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయకుండా, పక్కదారి పట్టించినందుకు కేసు నమోదు చేయాలి అన్నారు.
దేవుని సాక్షిగా యాదాద్రి ఆలయంలో ఉప ముఖ్యమంత్రిని అవమానించిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని గేట్లు మూసి బంధించినందుకు రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ను దళితుడు అని సంభోదించి ఆయనను అవమానించినందుకు కేసు పెట్టాలి,చేవెళ్ల, ఇంద్రవెల్లి సాక్షిగా దళితులు, గిరిజనులను పట్టపగలే మోసం చేసినందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై కేసు పెట్టాలి అన్నారు.
లగచర్ల గిరిజనుల భూములు అక్రమంగా కబ్జా చేసినందుకు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. గ్రూప్ 1, గ్రూప్ 2లో వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో మాటిచ్చి మాల-మహర్- నేతకాని- మాదిగ- ఉపకులాలను మోసం చేసిన రేవంత్ పై పెట్టాలి అన్నారు. వేముల వీరేశం అసెంబ్లీలో ఇచ్చిన స్వీట్ ను పబ్లిక్ గా నిరాకరించి, తన ఎంగిలి చేతిని షర్టుకు పూసి ఆయనను అవమానించినందుకు రేవంత్ పై కేసు పెట్టాలి.. అధికారిక పార్టీ కార్యక్రమానికి రాకుండా వేముల వీరేశంను పోలీసుల చేత ఆపి, అవమానించినందుకు రేవంత్ రెడ్డి పై అట్రాసిటీ కేసు పెట్టాలి అన్నారు.
Also Read:సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ
రేవంత్ రెడ్డి ముమ్మాటికీ అసమర్థుడే.. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డికి పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కూడా చేత కాలేదు, పోలీసులు, అధికారులు, ఇన్విజిలేటర్లు అందరు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడు? , అతనికి సహకరించినవారు ఎవరు? నిందితుని వెనుక ఉన్నదెవరు?.. ఏ తప్పు చేయకపోయినా డి బార్ అయిన విద్యార్థిని భవిష్యత్ ఏంటి? చెప్పాలన్నారు.