మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్‌లు!

7
- Advertisement -

మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్‌లు కూర్చున్నారు అని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్ ప్రవీణ్… తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తారకులా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు..ప్రజలు ఓటేస్తే మంత్రులుగా అయ్యి, వారి దుకాణాలు ఓపెన్ చేసుకొని, ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని ఎప్పుడూ అనుకోలేదు అన్నారు.

ఆఫీషియల్‌గా సెక్రటేరియట్‌లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఎందుకు జరుగుతున్నాయి… కొండా సురేఖ కూతురు సుస్మిత నిజం చెప్పింది.. అసలు కాల్ డీటెయిల్స్ తీయాల్సినవి రేవంత్ రెడ్డివి, రోహిన్ రెడ్డివి, పొంగులేటివి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి అన్నారు. వీళ్ళ అందరి కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠా గూడుపుఠాని బైట పడుతుంది అన్నారు.

ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేక పోతున్నారు … అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్‌కి ఏం సంబంధం చెప్పాలన్నారు. అసలు తల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏంది.. అసలు ఒక సివిలియన్ చేతులోకి పిస్టల్ ఎలా వచ్చింది…సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా…మంత్రి మనిషి గన్‌తో బెదిరిస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు చెప్పాలన్నారు ప్రవీణ్ కుమార్.

సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు…కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుండి తెలంగాణ భవన్‌కు నడిచి వస్తే కేసు పెట్టారు.. మన్నె క్రిశాంక్ ట్వీట్ చేస్తే 10 కేసులు పెట్టారు…ఇది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అని వాట్సప్ గ్రూపులో పెడితే అరెస్ట్ చేశారు…అలాంటిది మంత్రి మనిషి ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యంపై గన్‌తో బెదిరిస్తే ఇప్పటి వరకు అతని మీద పోలీసులు కేసు నమోదు చేయలేదు అన్నారు.

Also Read:ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం

- Advertisement -