పీడిత ప్రజల కోసం నిస్వాస్థంగా పనిచేశానని తెలిపారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యం నుంచి తనను ఈ చిల్లర రాజకీయాలు దూరం చేయలేవని స్పష్టం చేశారు.
తెలంగాణ వాదం – బహుజనవాదం రెండూ ఒక్కటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్, మాయావతిని ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయ్యిందని అన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని …ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని స్పష్టం చేశారు. తన మీద సోషల్‌మీడియాలో కొంతమంది చేస్తున్న అనాగరికమైన దాడులు కొత్తకాదని తెలిపారు. చట్టసభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో.. ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీజేపీ కుట్రల నుంచే దేశాన్ని రక్షించే దమ్ము-ధైర్యం కాంగ్రెస్‌కు ముమ్మాటికీ లేదని స్పష్టం చేశారు.
Also Read:బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి:మాజీ మంత్రి మల్లారెడ్డి