బహుజనుల కేంద్రంగా కొత్తపార్టీ:ప్రవీణ్ కుమార్

109
prveen kumar

త్వరలో బహుజనుల కేంద్రంగా కొత్త పార్టీ రాబోతుందని తెలిపారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్‌..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని తేల్చి చెప్పారు.

సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారు. ఆరేళ్ళ పాటు సమయం వృధా కావొద్దనే బయటికి వచ్చానన్నారు. గురుకులాల్లో అక్రమాలకు తావులేదు, తప్పు చేస్తే ఉరికంభం ఎక్కడానికి సిద్దమని తెలిపారు. తనను దళిత అధికారి అని పిలవడం నచ్చలేదని తాను అందరివాడినని తెలిపారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని…తనపై ఆరోపణలు చేసిన వారు దేశంలోని అత్యున్నత సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తాను హిందూ వ్యతిరేకినని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని…అందరికి సమాన అవకాశాలు దక్కాలన్నదే తన అభిమతమన్నారు.